తెలంగాణలోని మేడ్చల్ లో ఉంటున్న మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కొనాయిపల్లికి చెందిన సాయినాథ్ కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరుకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఓ గుడిలో పెళ్లి చేసుకుని తమకి రక్షణ కావాలని మనోహరబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ప్రేమ జంటను మేడ్చల్ తీసుకెళ్తుండగా కాళ్ళకల్ వద్ద NH 44పై యువతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. పోలీసుల ముందే యువకుడిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లిపోయారు యువతి కుటుంబ సభ్యులు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
0 Comments