ఇన్ని రోజులూ పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీసిన పసిడి ధరల్లో ఆరంభమైన డౌన్ ఫాల్ కొత్త ఏడాది ఆరంభంలోనూ కొనసాగుతోంది. ఇటీవలే రికార్డు స్థాయికి చేరిన రేట్లు ఇప్పుడు నేలచూపులు చూస్తోన్నాయి. ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి. వీటి రేట్లు తగ్గడం వరుసగా ఇది మూడో రోజు. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,35,370, 22 క్యారెట్లు రూ. 1,23,273గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,34,720, 22 క్యారెట్లు రూ. 1,23,483గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,34,330, 22 క్యారెట్లు రూ. 1,23,318గా కొనసాగింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,35,210, 22 క్యారెట్లు రూ.1,23,950 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ. 1,34,900, 22 క్యారెట్లు రూ. 1,24,584, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,34,920, 22 క్యారెట్లు రూ. 1,23,685 గా నమోదైంది. కేజీ వెండి ధరలను పరిశీలిస్తే- ఢిల్లీలో 999 స్వచ్ఛతతో రూ. 2,33,340గా నమోదైంది. ముంబై- రూ. 2,33,750, కోల్‌కతా- రూ. 2,33,440, చెన్నై కోల్‌కతా- రూ. 2,34,430, బెంగళూరు కోల్‌కతా- రూ. 2,33,930, హైదరాబాద్ కోల్‌కతా- రూ. 2,34,120గా ధరలు ఉన్నాయి.
0 Comments