Ad Code

అంతర్జాతీయ మార్కెట్లలో వన్‌ప్లస్‌ నార్డ్‌ 6, వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 6


అంతర్జాతీయ మార్కెట్లలో నార్డ్‌ బ్రాండ్ కింద వన్‌ప్లస్‌ నార్డ్‌ 6, వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 6 రీబ్రాండెడ్ వెర్షన్‌లలో లాంచ్ అవనున్నాయి. వన్‌ప్లస్‌ నార్డ్‌ 6 పలు గ్లోబల్ సర్టిఫికేషన్లను పొందింది. మలేషియా, యూఏఈలో అనుమతులు లభించాయి. సాధారణంగా ఈ ప్రక్రియ ఫోన్ అధికారిక లాంచ్‌కు కొన్ని వారాలు ముందు జరుగుతుంది. గతేడాది జూలైలో నార్డ్‌ 5 విడుదల కాగా, ఈసారి నార్డ్‌ 6 మోడల్స్ 2026 ఆరంభంలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వన్‌ప్లస్ ఇప్పటివరకు అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. అయినా గతంలో టర్బో మోడళ్లను గ్లోబల్ మార్కెట్లలో రీబ్రాండ్ చేసింది. ఆ ప్రకారం నార్డ్‌ 6 కూడా రావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. వన్‌ప్లస్‌ నార్డ్‌ 6 గ్లోబల్ లాంచ్‌కు సిద్ధమవుతోందని తెలుస్తోంది. 2026 తొలి అర్ధభాగంలో ఇండియాతో పాటు ఇతర దేశాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. చైనాలో వన్‌ప్లస్‌ టర్బో 6 ధర CNY 2,099 (సుమారు రూ.27,000), వన్‌ప్లస్‌ టర్బో 6వీ ధర CNY 1,699 (సుమారు రూ.21,000). ఈ రెండు ఫోన్స్ మిడ్‌రేంజ్ విభాగంలో ఉన్నాయి. అంచనాల ప్రకారం.. వన్‌ప్లస్‌ నార్డ్‌ 6 ధర రూ.28,000 నుంచి రూ.32,000 మధ్య ఉండవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 6 ధర రూ.22,000 నుంచి రూ.25,000 మధ్య ఉండే అవకాశముంది. రెండింటిలో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s జెనెరేషన్ 4 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది నార్డ్‌ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన ఫోన్లలో అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌గా నిలవొచ్చు. ఈ ఫోన్‌లో 16జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్ ఉండొచ్చని సమాచారం. ఇందులో అత్యంత హైలైట్ బ్యాటరీనే. 9,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్లు ఉండనున్నాయి. ఇది మిడ్‌రేంజ్‌లో కొత్త బెంచ్‌మార్క్ అనే చెప్పాలి. దీనిలో IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి. ఇవి దుమ్ము, ధూళి, నీటి నుంచి రక్షణ ఇస్తుంది. నీటిలో మునిగినా, అధిక ప్రెషర్ వాటర్ జెట్స్‌ను కూడా తట్టుకునే స్థాయి వీటికి ఉంటుంది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో ఇలాంటి ప్రొటెక్షన్ చాలా అరుదు. 50MP Sony LYT-600 మెయిన్ సెన్సర్ (OISతో)తో ఈ ఫోన్స్ రానున్నాయి. 16MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఆక్సిజన్‌ ఓఎస్‌తో లాంచ్ అవుతుందని అంచనా.

Post a Comment

0 Comments

Close Menu