Ad Code

ఒప్పో ఏ 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల


దేశీయ మార్కెట్లో ఒప్పో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఏ 6 ప్రో 5జీను అధికారికంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన ఒప్పో ఏ 5 ప్రో 5జీకి అప్డేటెడ్ గా ఈ మొబైల్ లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ గరిష్టంగా 1125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు IP66, IP68, IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉన్నాయి. అధిక పీడన నీటిలో, పూర్తిగా నీటిలో మునిగిన పరిస్థితులు, అలాగే 80 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి నీటిని కూడా తట్టుకునేలా దీనిని డిజైన్ చేశారు. ఇందులో మీడియా టెక్ డిమెన్షిటీ 6300 (6nm) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 8GB LPDDR4x ర్యామ్‌తో పాటు 128GB / 256GB UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. గేమింగ్, హెవీ యూజ్ కోసం 3900mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అందించామని కంపెనీ తెలిపింది. ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15పై పనిచేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే ఇందులో 50MP ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 16MP కెమెరాను అందించారు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీను పొందుపరిచారు. దీనికి 80W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. కంపెనీ ఈ మొబైల్ కు 5 సంవత్సరాల దీర్ఘకాలిక దృఢత్వాన్ని హామీ ఇస్తుంది. ఇక కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 5G SA/NSA సపోర్ట్, డ్యుయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.4, GPS, USB Type-C వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ బరువు 216 గ్రాములు కాగా, మందం 8.6mmగా ఉంది. ఈ మొబైల్ క్యాపిచినో బ్రౌన్, అరోరా గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu