Ad Code

ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీపై డిస్కౌంట్ ఆఫర్ !


దేశీయ మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన శాంసంగ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ UA43UE84AFULXLపై ఫ్లిప్ కార్ట్ సేల్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన 37% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 25,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,490 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది. ఈ శాంసంగ్ క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 2025 ఎడిషన్ 4K UHD రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 4K రెజల్యూషన్ (3840 × 2160) తో సూపర్ క్లీర్ మరియు డీటైల్‌ విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Crystal Processor 4K ను ఉపయోగించి తక్కువ రిజల్యూషన్ ఉన్న కంటెంట్‌ను కూడా 4K అప్‌స్కేలింగ్ తో ఎక్కువ క్లారిటీ తో అందిస్తుంది. అలాగే, ఈ టీవీ కలిగిన Pur Color, మెగా కాంట్రాస్ట్ మరియు కలర్ బూస్టర్ వంటి డిస్ప్లే ఫీచర్స్ వల్ల రంగులు మరింత సహజసిద్ధంగా కనిపిస్తాయి. అలాగే, HDR10+ సపోర్ట్‌తో కాంట్రాస్ట్ ఇంకా మెరుగుపడుతుంది. ఈ టీవీ స్మార్ట్ ఫీచర్లతో పాటు Tizen OS తో వస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Alexa మరియు Bixby వాయిస్ అసిస్టెంట్‌ తో వస్తుంది. అలాగే, శాంసంగ్ టీవీ ప్లస్ ద్వారా 100+ ఉచిత ఛానల్స్ ను కూడా ఈ టీవిలో మీరు యాక్సెస్‌ చేయవచ్చు. ఈ టీవిలో Wi-Fi 5, బ్లూటూత్ 5.2, 3 HDMI పోర్ట్‌లు (eARC), 1 USB పోర్ట్ మరియు LAN పోర్టు వంటి కనెక్టివిటీ సపోర్ట్ లతో కూడా ఉన్నాయి. ఈ టీవీ 20 W ఆడియో అవుట్పుట్ అందిస్తుంది. ఇందులో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్, అడాప్టివ్ సౌండ్, Q-Symphony వంటి ఆడియో టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu