భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ నిబంధనలను పాటించని కారణంగా, 35 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను రద్దు చేసింది. దీంతో సదరు సంస్థలు ఇకపై రుణాలు ఇవ్వడం లేదా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యపడదు. ప్రజలు ఈ సంస్థలతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దని, ముఖ్యంగా వీటి నుండి లోన్లు తీసుకోవడం లేదా వస్తువులను తాకట్టు పెట్టడం చేయవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఏదైనా సంస్థతో లావాదేవీలు జరిపే ముందు దాని లైసెన్స్ స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించింది. ఆర్బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 45-IA (6) ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. ఈ సంస్థలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండటానికి అవసరమైన నిబంధనలను పూర్తి చేయడంలో విఫలమయ్యాయని ఆర్బీఐ గుర్తించింది. ఇకపై ఇవి ఆర్థిక మధ్యవర్తిత్వ కార్యకలాపాలు నిర్వహిస్తే అది చట్టవిరుద్ధం అవుతుంది.
0 Comments