ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి దాదాపు 32.79 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ బంగారం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.19.15 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వివరించారు. ఆఫ్రికన్ దేశాల నుంచి ఈ ఇద్దరు మహిళలు వచ్చారని చెప్పారు. వీరిద్దరు వేర్వేరుగా విదేశాల నుంచి వచ్చారన్నారు. సదరు మహిళల లోదుస్తులతోపాటు లగేజీలో భారీగా బంగారం దాచినట్లు గుర్తించామని కస్టమ్స్ అధికారులు వివరించారు. వీరిద్దరిని అరెస్ట్ చేశామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి.. విచారిస్తున్నామని కస్టమ్స్ అధికారులు చెప్పారు.
0 Comments