Ad Code

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్‌ డే సేల్‌ : జీబ్రానిక్స్‌ పిక్సాప్లే 22 ప్రొజెక్టర్‌పై డిస్కౌంట్ ఆఫర్ !


ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్‌ డే సేల్‌ జనవరి 17 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌, ప్లస్ మెంబర్లు 24 గంటల ముందుగానే సేల్‌ లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. HDFC బ్యాంకు క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ సేల్‌కు సంబంధించిన అనేక డీల్స్‌ క్రమంగా వెల్లడవుతున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ జీబ్రానిక్స్ ప్రొజెక్టర్‌పై భారీ డిస్కౌంట్‌ ను అందిస్తుంది. జీబ్రానిక్స్‌ పిక్సాప్లే 22 ప్రొజెక్టర్‌ ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో రూ.8999 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ప్రొజెక్టర్‌ 3400 లూమెన్స్ బ్రైట్‌నెస్‌, ఎలక్ట్రానిక్స్‌ ఫోకస్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. జీబ్రానిక్స్‌ పిక్సాప్లే 22 ప్రాజెక్టర్‌ 63.5 సెంటీమీటర్ల నుంచి 406 సెంటీమీటర్ల వరకు ప్రొజెక్షన్‌కు సపోర్టు చేస్తుంది. అయితే గరిష్ఠంగా 150 అంగుళాల వరకు ప్రాజెక్షన్‌ ను అందిస్తుంది. 1280 x 720 పిక్సల్ నుంచి 1920 x 1080 పిక్సల్‌ వరకు గరిష్ఠంగా రిజల్యూషన్‌ ను అందిస్తుంది. 720p, 1080p, FHD వీడియోలను సపోర్టు చేస్తుంది. ఈ ప్రాజెక్టర్‌ LED డిస్‌ప్లే టెక్నాలజీని కలిగి ఉంది. 3400 లూమెన్స్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. మిరాకాస్ట్‌, iOS స్క్రీన్‌ మిర్రరింగ్‌ ను సపోర్టు చేస్తుంది. 30,000 గంటల LED ల్యాంప్‌ సపోర్టు ఉంది. దీంతోపాటు ఎలక్ట్రానిక్స్‌ ఫోకస్‌, రిమోటో కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. జిబ్రానిక్స్‌ పిక్సాప్లే 22 స్మార్ట్‌ ప్రాజెక్టర్‌ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ తో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ సపోర్టును కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 9.0 OS పైన పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌, iOS డివైజ్‌లను సపోర్టు చేస్తుంది. ఓటీటీ యాప్స్‌ ను కూడా సపోర్టు చేస్తుంది. జీబ్రానిక్స్‌ పిక్సాప్లే 22 స్మార్ట్‌ ప్రాజెక్టర్‌ హోం థియేటర్‌ ప్రొజెక్టర్‌ మోడల్‌ అయినా.. సినిమాలు, టీవీ షోలతోపాటు గేమింగ్‌ కోసం కూడా అనుకూలంగా ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం ఇన్‌బిల్ట్‌ స్పీకర్లను కలిగి ఉంది. ఈ ప్రొజెక్టర్‌ గ్రీన్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ జీబ్రానిక్స్‌ స్మార్ట్‌ ప్రాజెక్టర్‌ డ్యూయల్‌ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, USB, AUX, HDMI వంటి మల్టీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టర్ కేవలం 790 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. ఫలితంగా ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేందుకు వీలుంటుంది. ఈ ప్రాజెక్టర్‌ కొనుగోలుతో రిమోట్‌, పవర్‌ అడాప్టర్‌, ప్రొటెక్టివ్‌ స్లీవ్‌, క్వారీ లూప్‌, HDMI కేబుల్‌ వంటి పొందవచ్చు. ప్రస్తుతం ఈ ప్రొజెక్టర్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే రిపబ్లిక్‌ డే సేల్‌ లో మరింత తగ్గింపు ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu