Ad Code

'బిర్యానీ క్యాపిటల్' గా హైదరాబాద్ : గతేడాది 1.75 కోట్ల బిర్యానీలు ఆర్డర్


తెలంగాణ రాజధాని హైదరాబాద్ అరుదైన ఘనత సాధించింది. దేశంలో బిర్యానీ క్యాపిటల్ గా భాగ్యనగరం నిలిచింది. గతేడాది ఏకంగా 1.75 కోట్ల బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. అది కూడా ఒకే ఫుడ్ డెలివరీ యాప్ కావడం విశేషం. స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా 2025 లో ఏకంగా కోటీ 75 లక్షల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని స్విగ్గీ వార్షిక రిపోర్టులో వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా ఆర్డర్‌ చేసిన బిర్యానీలలో ఇది దాదాపు 18 శాతం కావడం గమనార్హం. బిర్యానీలో చికెన్ బిర్యానీని కోటీ 8 లక్షల ఆర్డర్లు వచ్చాయి. అంటే బిర్యానీ మొత్తం ఆర్డర్లలో ఇది 61 శాతంగా ఉంది. బిర్యానీ తర్వాత అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్ లో వెజ్ దోశ ఉంది. వెజ్‌ దోశకు మొత్తం 39.9 లక్షలు ఆర్డర్లు వచ్చాయి. మూడో స్థానంలో ఇడ్లీ ఉంది. ఇడ్లీకు 34 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తన రిపోర్టులో పేర్కొంది. బూంది లడ్డూకు 3.3 లక్షల ఆర్డర్లు, ఆ తర్వాతి స్థానాల్లో చాకోలెట్, గులాబ్ జామ్ ఉన్నాయి. ఈవెనింగ్ స్నాక్స్ లో చికెన్ బర్గర్ కు 6.8 లక్షల ఆర్డర్లు లభించాయి. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్ ఫ్రై, చికెన్ షావర్మా, వెజిటేరియన్ పిజ్జా, వెజిటేరియన్ పఫ్ లు ఉన్నాయి. ఇక రాత్రి సమయంలో చికెన్ బిర్యానీ టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత చికెన్‌ బర్గర్‌, చికెన్‌ షావర్మ ఉన్నాయి. స్విగ్గీ ద్వారా అత్యధిక ఆదాయం అందుకున్న నగరాల్లో హైదరాబాద్ నగరం మూడో స్థానంలో ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu