Ad Code

టాలీవుడ్‌లో దర్శకుడు కేకే హఠాన్మరణం


టాలీవుడ్ దర్శకుడు కేకే అలియాస్ కిరణ్ కుమార్ కన్నుమూశారు. బుధవారం ఆయన మరణించినట్లు ' కింగ్ జాకీ క్వీన్ ' సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అనారోగ్యంతో హస్పిటల్‌లో చేరిన ఆయనకు శస్త్ర చికిత్స చేయగా.. అది కాస్త విఫలం అవడంతో బ్రెయిన్ డెడ్ అయ్యాడని సమాచారం. 2010లో నాగార్జున హీరోగా వచ్చిన కేడీ సినిమాకు కిరణ్‌ దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఆశించిన మేర సక్సెస్ కాకపోవడంతో చాలా కాలం పాటు తెరమరుగయ్యారు. 15 ఏండ్ల తర్వాత రీసెంట్ గా రీ ఎంట్రీ ఇస్తూ కేజేక్యూ - కింగ్ జాకీ క్వీన్ అనే చిత్రాన్ని రుపొందిస్తున్నారు. అది త్వరలో ఈ సినిమా విడుదల కానుండగా.. ఆయన హఠాన్మరణం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu