కొత్త లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపడతాం !


హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కొత్త లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రసంగిస్తూ పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల కన్నా ఈ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో అర్థవంతమైన చర్చ జరిగింది. ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారు. అలాగే అత్యంత పేదరికం ఉంది. ప్రపంచమే కుగ్రామం అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదని కేటీఆర్‌ అన్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలలో భాగంగా కొత్త సంస్కరణలు తీసుకువస్తే భారతదేశంలో కష్టమని మాజీ మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. 'ఈ దేశంలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కేసీఆర్ పేదవారి సంక్షేమాన్ని ఎన్నడూ విస్మరించకుండా మానవీయ కోణంలో ఆలోచించారు. ప్రతిపక్షంలో ఉండగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ చలించిపోయి పార్టీ తరఫున ఆర్థిక సాయం చేశారు. కనీసం పాలకుల్లో చలనం వస్తుందని కేసీఆర్ ఆనాడు పార్టీ తరఫున సాయం చేశారు' అని కేటీఆర్‌ గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పరంగా సాయం చేశారని చెప్పారు. నాలుగు దశాబ్దాల క్రితం చైనా జీడీపీ మనకన్నా తక్కువగా ఉండేది. ఇప్పుడు మనది నాలుగు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయితే, చైనాది 60 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ. చైనా ఎప్పటికప్పుడు ప్రజలకు అనుగుణంగా నూతన విధానాలు తీసుకురాబట్టే ఫలితాలు సాధించింది. అలాంటి వాటిపై ఈ దేశంలో చర్చ జరగదని కేటీఆర్‌ పేర్కొన్నారు. 'అన్నింటికీ మందు.. పోరాడే పార్టీకి పార్లమెంట్‌లో తగిన సీట్లు ఇవ్వడమే. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రాతినిథ్యం లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఇలాంటి చట్టాలను తెస్తున్నాయి' అని తెలిపారు. ఏకాచత్రాధిపత్యంతో ఎలాంటి అనర్థం జరుగుతుందో ఇండిగో విమానయాన సంస్థతో ప్రయాణికులకు ఐదు రోజులుగా జరిగిన అసౌకర్యం ప్రత్యక్ష ఉదాహరణ. ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు కొంతమంది చేతుల్లో పెట్టడంతో ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి. శ్రమదోపిడీ వల్లే ఇదంతా జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇండిగో ఒత్తిడికి కేంద్రమే తలొగ్గింది తప్ప, ఇండిగో తగ్గలేదు. కేంద్రం ఐదు రోజుల తర్వాత స్పందించడంతో ఎయిర్‌పోర్టులు బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లుగా మారాయి. కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తే ఇండిగోతో జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకు విస్తరిస్తుంది. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఏ కార్మిక సంఘంతో కలిసి బీఆర్‌టీయూ పనిచేసినా అభ్యంతరం లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, బీఆర్‌టీయూ ఎవరితోనైనా పని చేయొచ్చని చెప్పారు. లేబర్ కోడ్‌లు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకుంటే దేశానికి దిక్సూచి అవుతుందని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఢిల్లీలో సోనియా గాంధీ వ్యతిరేకించిన బిల్లును తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ఎలా అమలు చేస్తాడని ప్రశ్నించారు. ఇక్కడి నుంచే పోరాటాన్ని మొదలుపెడదామని ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర కార్మిక మంత్రిని, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యులను కలుద్దామని, లేబర్ కోడ్‌ల అమలు ఆపేదాకా అసెంబ్లీ, మండలి సమావేశాలు స్తంభింపజేస్తామని కార్యాచరణ ప్రకటించారు. వరంగల్‌లో తదుపరి రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains