తెలంగాణాలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన రివ్యూ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేండ్లలో నియోజకవర్గంలో 250 ఇండ్లు కూడా కట్టించలేదని, కాంగ్రెస్ వచ్చాక ఏడాదిలోనే 3,500 ఇండ్లు మంజూరు చేశామని మంత్రి అన్నారు. లబ్ధిదారులు ఇండ్ల పనులు ప్రారంభిస్తే వారం రోజుల్లోనే బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా పనులు మొదలుపెట్టని పక్షంలో ఇండ్లను క్యాన్సిల్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. అన్ని పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు నిరంతరం సేవలు అందించాలని సూచించారు. సిబ్బంది కొరత సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్యలు, వేలాడుతున్న కేబుల్స్ తొలగింపు కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సర్వాయి పాపన్న కోట, మహాసముద్రం గండి ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.
0 Comments