తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైలు మార్గంలో గురువారం అర్థరాత్రి నవదంపతులు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం (25), భవాని (22) రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. సింహాచలం హైదరాబాద్‌లో ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో అద్దె ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కారు. వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిని తరువాత ఇద్దరు డోర్ వద్ద నిల్చొని ఉన్నారు. డోర్ నుంచి ఇద్దరు కిందపడడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ట్రాక్‌మెన్ గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
0 Comments