Ad Code

కాళ్ల పారాణి ఆరకముందే గుండెపోటుతో కుప్పకూలిన వరుడు


ర్ణాటక లోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా హనుమంతపుర గ్రామానికి చెందిన రమేష్‌ (30)కి విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా బండ్రి గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం నిశ్చితార్థం జరగగా నవంబర్‌ 30వ తేదీన పెళ్లి జరిగింది. అనంతరం మంగళవారం పెళ్లి కుమార్తె ఇంటికి వధువు, వరుడు తిరిగింపులకు రావడంతో పెద్ద ఎత్తున గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగింపును కూడా నిర్వహించారు. వధువు ఇంటికి చేరిన తర్వాత పెళ్లి కుమార్తె ఇంట్లో కాలు పెట్టగానే వరుడికి గుండెపోటుతో కుప్పకూలి పోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించాడు. ఈ ఘటనతో పెళ్లి కుమార్తె ఇంట ఆక్రందనలు మిన్నంటాయి. కాగా పెళ్లి కుమారుడు రమేష్‌ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో తల్లి సొంత ఊరు హొసకుప్పె గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు. ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

Post a Comment

0 Comments

Close Menu