Ad Code

హీరోయిన్ల బట్టల గురించి మాట్లాడే ముందు మీరు ధోతీ కట్టుకోండి : నటుడు శివాజీపై విరుచుకుపడ్డ చిన్మయి


'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. ”హీరోయిన్లు చీరలు కట్టుకోవాలని, లేదంటే వారి ‘సామాన్లు’ కనిపిస్తాయని శివాజీ అనడాన్ని చిన్మయి తప్పుబట్టింది. ముఖ్యంగా ‘దరిద్రపు ము…’ వంటి పదాలను ప్రొఫెషనల్ వేదికలపై వాడటం ఏంటని శివాజీని ప్రశ్నించింది. సామాన్లు వంటి పదాలను కేవలం ‘ఇన్సెల్స్’ (స్త్రీ ద్వేషులు) మాత్రమే వాడుతుంటారని ఆమె విమర్శించింది. అంతేగాకుండా హీరోయిన్లు భారతీయ సంప్రదాయం పాటించాలని చెప్పిన శివాజీ తాను మాత్రం జీన్స్, హూడీలు ధరిస్తారు. సంప్రదాయం గురించి అంతగా మాట్లాడేటప్పుడు ఆయన కేవలం ధోతీలు మాత్రమే కట్టుకోవాలి కదా? నుదుట బొట్టు పెట్టుకోవాలి, వివాహం అయినట్లు గుర్తుగా కంకణాలు, మెట్టెలు ధరించాలి కదా? అంటూ చిన్మయి ప్రశ్నించింది. ఒక సినిమాలో విలన్‌గా నటించిన శివాజీ, బయట ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా స్త్రీలను ద్వేషించే వ్యక్తులకు హీరోగా మారుతున్నారని ఆమె ఎద్దేవా చేసింది. ఒక బహిరంగ వేదికపై మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన ఉండటం నమ్మశక్యంగా లేదని, అసలు మహిళలను ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'దండోరా' కార్యక్రమంలో ఆయన వాడిన భాష, పదజాలంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. శివాజీ ఈ వేదికపై మాట్లాడుతూ నేటితరం హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శనపై ఘాటు విమర్శలు చేశారు. “స్త్రీ అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అని శివాజీ అన్నారు. అంతేగాకుండా హీరోయిన్లు పొట్టి బట్టలు వేసుకున్నప్పుడు బయటకు అందరూ పొగిడినా, లోపల మాత్రం అసహ్యించుకుంటారని చెబుతూ.. కొన్ని వివాదాస్పదమైన పదాలను ఉదాహరణగా వాడారు. హీరోయిన్లు సావిత్రి, సౌందర్య వంటి మహానటులను స్ఫూర్తిగా తీసుకోవాలని, గ్లామర్ అనేది ఒక హద్దులోనే ఉండాలని హితవు పలికారు. 


Post a Comment

0 Comments

Close Menu