Ad Code

ఇమ్మడి రవి బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు


సినీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవికి బిగ్‌ షాక్‌ తగిలింది. బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్‌ కోర్టు గురువారం తిరస్కరించింది. పోలీస్‌ కస్టడీ కారణంగా రవి బెయిల్‌ పిటిషన్‌ విచారణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. మూడో దఫా కస్టడీ విషయంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మరోసారి అప్పీల్‌కు వెళ్లడంతో ఆ విచారణ మరింత ఆలస్యం కావొచ్చని రవి ఆందోళన చెందాడు. అయితే.. ఆ అప్పీల్‌ను విచారిస్తూనే ఇటు రవి బెయిల్‌ పిటిషన్‌నూ కోర్టు పరిశీలించింది. చివరకు కేసుల తీవ్రత దృష్ట్యా రవి బెయిల్‌కు అనర్హుడని తేల్చింది. 


Post a Comment

0 Comments

Close Menu