జామపండ్లలో డైటరీ ఫైబర్, విటమిన్ సీ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపరిచే శక్తి ఉంటుంది. ముఖ్యంగా తొక్కతో తింటే మరింత ప్రయోజనమని న్యూట్రిషియన్స్ చెబుతున్నారు. ఫైబర్ పేగు కదలికలను మెరుగుపరచి మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. జామలో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఇమ్యూనిటీ పెరిగి వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండగలం. దీనిలోని ఫైబర్ కారణంగా రక్తంలో గ్లూకోస్ ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది. షుగర్ స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. దీంతో డయాబెటిస్ నియంత్రణలో సహాయం చేస్తుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జామలో ఉండే పొటాషియం, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అందువల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువ ఉండడంతో..ఇవి కడుపు నిండిన భావన కలిగించడంతో ఆకలి తగ్గి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వీటిలో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్, టానిన్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నాయి. ఇవి కీళ్లలో మంట, వాపు తగ్గించడంలో సహాయపడుతూ ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జామలోని ముఖ్యమైన పోషకాలు కంటికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. వయసుతో వచ్చే కంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. జామపండ్లలో ఉన్న విటమిన్ C, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో చర్మం ఆరోగ్యవంతంగా, మెరిసేలా మారుతుంది.రోజుకు ఒక జామ తింటే యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. జామలో ఉండే పాలీఫినాల్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ముఖ్యంగా పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
0 Comments