Ad Code

బీమా సొమ్ము కోసం తండ్రిని పాము కాటుతో చంపిన కొడుకులు !


మిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన గణేశన్ (56) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గత అక్టోబర్‌లో ఆయన పాము కాటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అంత్యక్రియలు పూర్తైన కొద్ది రోజులకే, గణేశన్ పేరిట ఉన్న బీమా పాలసీలకు సంబంధించిన రూ.3 కోట్ల క్లెయిమ్ కోసం ఆయన ఇద్దరు కుమారులు బీమా సంస్థను సంప్రదించారు. అయితే, గణేశన్ పేరిట అసాధారణంగా అధిక మొత్తంలో బీమా పాలసీలు ఉండటం, అలాగే క్లెయిమ్ కోరుతూ వచ్చిన కుమారుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో బీమా సంస్థ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు కేసును లోతుగా విచారించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముందే పథకం వేసుకుని తండ్రిని హత్య చేయించినట్లు తేలింది. పోలీసుల విచారణలో నిందితులు మరో సంచలన విషయం వెల్లడించారు. హత్యకు వారం రోజుల ముందు కూడా ఓసారి ప్రయత్నించి విఫలమైనట్లు ఒప్పుకున్నారు. ఆ తర్వాత అత్యంత విషపూరితమైన పామును తెచ్చి, నిద్రలో ఉన్న తండ్రి మెడపై కాటు వేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనను ప్రమాదంగా చూపించేందుకు పామును అక్కడికక్కడే చంపేశారు. అంతేకాదు, కావాలనే ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇద్దరు కుమారులతో పాటు వారికి సహకరించిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.  

Post a Comment

0 Comments

Close Menu