తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి ఉప్పల్ వేదికగా మ్యాచ్ ఆడటంపై సోషల్ మీడియా వేదికగా ఇది మరిచిపోలేని క్షణం అంటూ పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో అపర్ణ మెస్సి జట్టుతో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో తాను గోల్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడించారు. అంతేకాదు గోల్ చేసిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకుముందు మెస్సికి స్వాగతం చెబుతూ మరో పోస్ట్ పెట్టారు. ఇది ఇలా ఉండగా, ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ పూర్తయిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి మనువడితో మెస్సి ఫుట్ బాల్ అడిగిన సంగతి తెలిసిందే. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీకి జెర్సీ గిఫ్ట్ గా ఇచ్చారు మెస్సి. ఆ తర్వాత ఫలక్ నూమ ప్యాలస్ కు మెస్సి వెళ్లారు. శనివారం అక్కడే బస చేయనున్నారు. ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో ముంబైకి పయనం అవుతారు. అప్పటి వరకు హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
0 Comments