Ad Code

కోల్‌కతా మెస్సీ ఈవెంట్‌ నిర్వాహకుడి అరెస్టు : టికెట్‌ ధరలు వాపసు ఇవ్వనున్న నిర్వాహకులు


కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్‌ బాల్‌ లెజెండ్‌ లియెనెల్‌ మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. దీంతో లియోనెల్ మెస్సీ GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేశారు. కోల్‌కతాలో అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అంతేకాకుండా అభిమాల టికెట్‌ రుసుమును నిర్వాహకులు వెనక్కి ఇస్తారని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ రీఫండ్‌ ఎలా జరుగుతుంది అనేది పరిశీలించాలన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోల్‌కతా క్రీడాభిమానులకు ఇదొక చీకటి రోజుగా వ్యాఖ్యానించారు. నిర్వాహక లోపం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనీ, దీనికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అలాగే ముందు జాగ్రత్తలు తీసుకోని పోలీసు అధికారును సస్పెండ్‌ చేయాలని కూడా అన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి, దోషులను అరెస్టు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వాపసు ఇవ్వాలని, స్టేడియం ,ఇతర బహిరంగ ప్రదేశాలకు జరిగిన నష్టానికి నిర్వాహకులపై ఛార్జీలు విధించాలని, పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని గవర్నర్ అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu