మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV ఇ-విటారాను ఇటీవల ఆవిష్కరించింది. కొత్త కారును విడుదల చేయడమే కాకుండా EV యూజర్లకు ఉన్న అతిపెద్ద ఛార్జింగ్ సమస్యను పరిష్కరించేందుకు ఒక సమగ్రమైన 'యూనిఫైడ్ ఛార్జింగ్ ప్లాట్‌ఫారమ్' ను కూడా పరిచయం చేసింది. మారుతి సుజుకి ఇ-విటారా ఎస్‌యూవీ, బలమైన బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. ఈ కారు ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 543 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. ఇది దూర ప్రయాణాలకు వీలుగా ఉంటుంది. ఈ ఈవీ వచ్చే ఏ జనవరి నుంచి సేల్ కు రెడీగా ఉంటుంది. వన్ ఈవీ ఛార్జింగ్ ప్లాట్‌ఫారమ్' ఇల్లు, బహిరంగ ఛార్జింగ్ స్టేషన్లను ఏకీకృతం చేస్తుంది. వినియోగదారులు ఎక్కడ ఉన్నా ఒకే యాప్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించవచ్చు, బుక్ చేసుకోవచ్చు అలాగే సులభంగా చెల్లింపులు చేయవచ్చు. దీనికోసం మారుతి సుజుకి దేశవ్యాప్తంగా 13 ప్రముఖ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు, అగ్రిగేటర్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం మారుతి సుజుకి డీలర్ నెట్‌వర్క్‌లో 2,000 పైగా ఎక్స్‌క్లూజివ్ ఛార్జింగ్ పాయింట్‌లు అందుబాటులో ఉన్నాయి. 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్షకు పైగా పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్‌లకు యాక్సెస్ కల్పించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
0 Comments