Ad Code

'ఓజీ' దర్శకుడు సుజిత్‌కు రేంజ్ రోవర్ కారుని బహుమతిగా ఇచ్చిన పవన్ కళ్యాణ్


ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా సాధించిన అద్భుత విజయానికి గాను దర్శకుడు సుజిత్‌కు లాండ్ రోవర్‌ కి చెందిన రేంజ్ రోవర్ కారుని బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని సుజిత్ సోషల్ మీడియా వేదికగా అభిమనులతో పంచుకున్నాడు. అలాగే ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేశారు. ఈ మేరకు ఆ పోస్టులో తాను అందుకున్న బహుమతుల్లో ఇది అత్యుత్తమమైనదని సుజిత్ ఎమోషనల్ అయ్యారు. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా, కృతజ్ఞతతో నిండిపోయానని, తనకు అత్యంత ప్రియమైన ఓజీ కళ్యాణ్ నుండి ఇంత ప్రేమ, ప్రోత్సాహం దక్కడం మాటల్లో చెప్పలేని ఆనందం ఇచ్చిందన్నారు. చిన్ననాటి నుంచి ఆయన అభిమానిగా మొదలైన ఈ ప్రయాణంలో ఈ ప్రత్యేక క్షణం మరింత మధురమైనది అంటూ రాసుకొచ్చారు. జీవితంలో ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానని పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu