ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో జరుగుతుంది. సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులు సంక్షోభంలో ఉన్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను రద్దు చేయడం ద్వారా పేదలు తీవ్రంగా బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు కాకుండా పెద్ద కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ఖర్గే ఈ చట్టాన్ని వ్యవసాయ చట్టాలతో పోల్చి, ఆ సమయంలో జరిగిన రైతు ఆందోళనలను గుర్తుచేశారు. ఉపాధి హామీ పథకం రద్దుకు వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు, పౌరుల హక్కులకు ఉన్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించడానికి పూర్వపు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం మక్కువతో అమలు కావాల్సిందని గుర్తుచేశారు.
0 Comments