Ad Code

మెసెంజర్ డెస్క్‌టాప్ యాప్‌ను నిలిపివేసిన మెటా !

మెసెంజర్ డెస్క్‌టాప్ యాప్‌ను మెటా అధికారికంగా నిలిపివేసింది. ఇకపై ఈ సేవలను ఉపయోగించాలనుకునే యూజర్లు ఫేస్‌బుక్ వెబ్‌సైట్ లేదా మెసెంజర్.కామ్ ద్వారా మాత్రమే మెసెంజర్‌ను యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఈ యాప్‌లను నిలిపివేయబోతున్నట్లు అక్టోబర్ నెలలోనే ప్రకటించింది. AppleInsider నివేదిక ప్రకారం, డిసెంబర్ 15 నుండి యూజర్లకు నోటిఫికేషన్‌లు పంపించడం ప్రారంభమవుతుంది. యాప్‌లు పూర్తిగా ఇన్‌యాక్టివ్‌గా మారేందుకు 60 రోజుల గడువు ఇవ్వనున్నారు.ఆ గడువు ముగిసిన తర్వాత ఈ యాప్‌లు పనిచేయవు. అందువల్ల, నిరుపయోగంగా మారిన యాప్‌లను తమ డివైస్‌ల నుంచి తొలగించాలని మెటా యూజర్లను కోరుతోంది. ఈ విషయానికి సంబంధించిన వివరాలు మెటా సపోర్ట్ పేజీలో పేర్కొంది. మ్యాక్ యూజర్లకు ఈ మార్పును ప్రత్యేకంగా తెలియజేసింది.మెసెంజర్ డెస్క్‌టాప్ యాప్‌ను నిలిపివేయడానికి చాలా కారణాలున్నాయి.స్క్రీన్ షేరింగ్, గ్రూప్‌ వీడియో కాల్ వంటి కీలక ఫీచర్లు లేకపోవడంతో, ఈ యాప్ యూజర్లను ఆకట్టుకోలేకపోయింది. అలాగే, 2023లో మెసెంజర్‌ను తిరిగి ఫేస్‌బుక్ యాప్‌లో విలీనం చేసిన మెటా, కొన్ని డెస్క్‌టాప్ యాప్‌లపై తన ఫోకస్ తగ్గించినట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. యూజర్లు తమ చాట్ హిస్టరీను సురక్షితంగా స్టోర్ చేసుకోవడానికి Secure Storageను యాక్టివేట్ చేయాలని మెటా సూచించింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లను భద్రపరిచేందుకు PINను సెటప్ చేయాలని, అలాగే 'Privacy and Safety > End-to-End Encrypted Chats > Message Storage' విభాగంలో ఉన్న సెట్టింగ్‌లను సరిచూసుకోవాలని కోరింది.ఇలా చేస్తే, యూజర్లకు చాట్ హిస్టరీ అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu