Ad Code

'రాష్ట్రీయ ప్రేరణా స్థల్'ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ


త్తరప్రదేశ్ లోని లక్నో నగరంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా సుమారు 65 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ. 230 కోట్ల వ్యయంతో నిర్మించిన 'రాష్ట్రీయ ప్రేరణా స్థల్'ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆకాశాన్ని తాకేలా నిలుచున్న మూడు భారీ కాంస్య విగ్రహాలు ఈ స్మారక చిహ్నంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిల 65 అడుగుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. 

Post a Comment

0 Comments

Close Menu