Ad Code

పవన్ కళ్యాణ్ ను కలిసిన జెన్ జడ్ వ్లాగర్ స్వాతి రోజా


మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో  దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుతున్న జెన్ జడ్ వ్లాగర్ స్వాతి రోజాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఆమె చేస్తున్న సాహన యాత్ర గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పర్యటనలో భాగంగా కొద్ది వారాల క్రితం ఆమె శ్రీశైలంలో పర్యటించినప్పుడు వసతి, భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమెకు శ్రీశైలంతోపాటు, తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ ని కలిసి, ఆయన చూపిన శ్రద్దకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీశైలంలో గతంలో ఎదురైన అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బైక్ రైడింగ్, బైకులపై తనకున్న ఆసక్తిని పవన్ కళ్యాణ్ పంచుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu