Ad Code

మోటరోలా ఎడ్జ్ 70 విడుదల !


దేశీయ మార్కెట్‌లో మోటరోలా మరో ఆకర్షణీయమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ మోటరోలా ఎడ్జ్ 70ను విడుదల చేసింది. మిడ్-రేంజ్ ఫోన్, స్టైలిష్ డిజైన్‌తో పాటు ప్రీమియం ఫీచర్లను అందిస్తూ ఎడ్జ్ సిరీస్ లైనప్‌లో ముఖ్యమైన మోడల్‌గా నిలుస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పండుగల సమయంలో వినియోగదారులను ఆకట్టుకునే లక్ష్యంతో ఈ లాంచ్ చేయడం విశేషం. ఈ ఫోన్ పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, గాడ్జెట్ గ్రే, లిల్లీ ప్యాడ్ అనే స్టైలిష్ రంగుల్లో అందుబాటులో ఉంది. డిజైన్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, రగ్డ్ ప్రొటెక్షన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే, మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో మోటరోలా ఎడ్జ్ 70 ఒక బలమైన పోటీదారుగా కనిపిస్తోంది.  మోటరోలా ఎడ్జ్ 70లో 6.7 అంగుళాల 1.5K AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్‌కు అనుకూలం, అవుట్‌డోర్‌లో కూడా స్పష్టమైన విజువల్స్ ఈ డిస్‌ప్లే ప్రీమియం విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనిలో 5,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఫోటోగ్రఫీకి ఈ ఫోన్‌లో 50MP పాంటోన్ వాలిడేటెడ్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

Post a Comment

0 Comments

Close Menu