దేశీయ మార్కెట్లో జనవరి 6న రెడ్‌మీ నోట్ 15 ను విడుదల కానున్నది. నోట్ సిరీస్‌కు భారత వినియోగదారుల్లో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని, ఈసారి మరింత అప్‌గ్రేడ్ ఫీచర్లతో ఫోన్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 108MP కెమెరా, 5520mAh బ్యాటరీ, సూపర్ స్లిమ్ బాడీ ఈ మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి. చైనాలో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్.. భారత వెర్షన్ ఇంకా రిలీజ్ కాలేదు. అయితే భారత్‌లో లాంచ్ కానున్న నోట్ 15, చైనా మోడల్‌తో పోలిస్తే కొన్ని కీలక మార్పులతో వస్తోంది. కెమెరా, సాఫ్ట్‌వేర్, డిజైన్ సెగ్మెంట్‌లోని కొన్ని స్పెసిఫికేషన్‌లు భారత మార్కెట్ అభిరుచులకు తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేశారని కంపెనీ వర్గాలు సూచిస్తున్నాయి.
0 Comments