Ad Code

త్వరలో 40వేల ఉద్యోగాలు భర్తీ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా 262.78 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంవత్సరంలో 60,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని చెప్పారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, దీని కోసం కసరత్తు జరుగుతుందని తెలిపారు. రెండున్నర సంవత్సరాలలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని, తెలంగాణ రాష్ట్రంలో విద్య పైన, ఉపాధి పైన సాగునీటి రంగాలపైనా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించిన సీఎం రేవంత్ రెడ్డి, నిరుద్యోగులు నిరాశ పడాల్సిన అవసరం లేదని, నిరుద్యోగుల ఉద్యోగ భర్తీకి తాము పెద్దపీట వేస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu