Ad Code

వివో ఎక్స్‌300, వివో ఎక్స్‌300 ప్రో అమ్మకాలు ప్రారంభం


వివో ఎక్స్‌300 సిరీస్‌లో వివో ఎక్స్‌300, వివో ఎక్స్‌300 ప్రో ను తాజాగా విడుదల చేసింది. ఈరోజు నుంచి వీటి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. వివో ఇండియా వెబ్‌సైట్‌ సహా ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లలో కొనుగోలు చేయొచ్చు. రెండు ఫోన్‌లు శక్తివంతమైన కెమెరా కాన్ఫిగరేషన్‌లు, ప్రీమియం డిజైన్‌లు, శక్తివంతమైన పనితీరును కలిగి ఉన్నాయి. వివో ఎక్స్‌300 మూడు కాన్ఫిగరేషన్లలో లాంచ్ అయింది. 112జీబీ+ 256జీబీ బేస్ వేరియంట్ ధర రూ.75,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.81,999 కాగా.. 16జీబీ+512జీబీ టాప్ వేరియంట్ ధర రూ.85,999గా ఉంది. ఈ ఫోన్ సమ్మిట్ రెడ్, మిస్ట్ బ్లూ, ఎలైట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. వివో ఎక్స్‌300 ప్రో సింగిల్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 16జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.1,09,999గా లాంచ్ అయింది. డ్యూన్‌గోల్డ్‌, ఎలైట్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. వివో ఎక్స్‌300, వివో ఎక్స్‌300 ప్రో ఫోన్‌లపై లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తోంది. లాంచ్ ఆఫర్ కింద ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఎస్ బ్యాంక్ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. మీరు వివో ఎక్స్‌300 సిరీస్‌ను నో-కాస్ట్ ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లను జీరో డౌన్ పేమెంట్‌తో రూ.3,167 నెలవారీ ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. మొదటి ఈఎంఐ కట్టి రూ.3,167తో వివో ఎక్స్‌300, వివో ఎక్స్‌300 ప్రో ఫోన్‌లను ఇంటికి తీసుకెళ్లొచ్చు. 6 నుంచి 24 నెలల వరకు కూడా ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది. అంతేకాదు ఈ రెండు ఫోన్‌లపై ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu