బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన 251 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలు పెంచుతున్న తరుణంలో, సామాన్యులకు ఊరటనిచ్చేలా ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. గతంలో కూడా ఈ ధరలో కొన్ని ప్లాన్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు పూర్తిస్థాయిలో మార్పులు చేసి 100GB డేటాను అందిస్తోంది. డేటా వినియోగం ఎక్కువగా ఉండే వారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేందుకు ఇది ఒక చక్కని అవకాశం. రూ. 251 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకున్న వారికి 28 రోజుల కాలపరిమితి లభిస్తుంది. ఇందులో రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 100GB హై-స్పీడ్ డేటాను వాడుకోవచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. వీటితో పాటు అదనంగా 'BiTV' అనే ఓటీటీ ప్లాట్‌ఫారమ్ సబ్‌స్క్రిప్షన్ 30 రోజుల వరకు లభిస్తుంది. దీనివల్ల వినియోగదారులు సినిమాలు, టీవీ షోలతో మంచి వినోదాన్ని పొందవచ్చు.న్యూ ఇయర్ సందర్భంగా ఈ ప్లాన్ తెచ్చింది. ఇది 2026 జనవరి చివరి వరకే ఉంటుంది.
0 Comments