Ad Code

డిసెంబర్ 22న కొత్త పార్టీ ఏర్పాటు : టీఎంసీ సస్పెండ్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్


శ్చిమ బెంగాల్‌లో డిసెంబర్ 22న కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు టీఎంసీ సస్పెండ్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జరుగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను 135 చోట్ల తమ అభ్యర్థులను నిలబెడతామని కబీర్ తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో తమ పార్టీ 'గేమ్ ఛేంజర్' కానుందని చెప్పారు. ముస్లింల కోసం తమ పార్టీ పనిచేస్తుందని, ఐఏఎంఐఎంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఆ పార్టీతో టచ్‌లో ఉన్నామని తెలిపారు. బెంగాల్‌లో బీజేపీని అధికారంలోకి రానీయమని, టీఎంసీ సైతం వచ్చే ఏడాది ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని కబీర్ చెప్పారు. బాబ్రీ మసీదు తరహాలో మసీదు నిర్మాణంపై మాట్లాడుతూ, దేశంలోని పలు పారిశ్రామిక సంస్థలు తనకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇండియాలోని ముస్లింల వద్ద చాలా నిధులున్నాయని, బాబ్రీ నిర్మాణానికి వారు సాయం అందించనున్నారని చెప్పారు. మసీదు నిర్మాణం మత ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నంగా బీజేపీ విమర్శిస్తుండగా, తాము సెక్యులర్ సిద్ధాంతాలను విశ్వసిస్తామని కబీర్ తెలిపారు. శనివారంనాడు నిర్వహించిన కబీర్ పౌండేషన్ 'బాబ్రీ మసీదు' ఈవెంట్‌కు 8 లక్షల మంది హాజరైనట్టు ఆయన చెప్పారు. ఇటుకలు, నగదు రూపంలో విరాళాలు వెల్లువెత్తుతున్నట్టు వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu