Ad Code

స్పాటిఫై 2025 టాప్ ఆల్బమ్స్ జాబితాలో ఓజీ


స్పాటిఫై 2025 టాప్ ఆల్బమ్స్ జాబితాలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చేరింది. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా.. బాక్సాఫీసు దగ్గర పవన్ కెరీర్‌లోనే అతిపెద్ద వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం పాటలు, బీజీఎం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు స్పాటిఫై 2025 బెస్ట్ ఆల్బమ్స్ జాబితాలో ఓజీ కూడా చేరడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ ఆల్బమ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాలో తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఆడియో ఇప్పటికీ టాప్ చార్ట్‌ల్లో నిలవడం సంచలనంగా మారింది.

Post a Comment

0 Comments

Close Menu