Ad Code

రూ. 1500 కోట్ల మెగా స్కాం కేసు : నటుడు సోనూ సూద్‌, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్‌ నోటీసులు జారీ


త్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బ్లూ చిప్ కంపెనీల ద్వారా రూ.1500 కోట్ల మెగా స్కాంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో భాగంగా నటుడు సోను సూద్ , గ్రేట్ ఖలీ ఇద్దరూ కంపెనీని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ పోలీసులు ఇద్దరికీ నోటీసులు పంపారు. వారు బ్లూ చిప్ కంపెనీని ప్రమోషన్స్‌, ప్రచారం చేశారా లేదా అనేది స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయమని కోరారు. ఇద్దరూ బ్లూ చిప్ కంపెనీని ప్రోత్సహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు అజారుద్దీన్ పేరు కూడా చర్చనీయాంశమైంది, సోనూ సూద్, రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రవీంద్ర సోని కంపెనీ ఈవెంట్‌లలో పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోను బాధితులు దుబాయ్ నుండి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు పంపారు. ఈ వీడియోలను పరిశీలించిన అనంతరం అజారుద్దీన్‌కు కూడా నోటీసు పంపవచ్చని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఈ భారీ మోసం కేసును దర్యాప్తు చేయడానికి ఒక సిట్ ని ఏర్పాటు చేశారు. అడిషనల్ డీసీపీ అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రవీంద్ర సోనీకి సంబంధించిన ఎనిమిది క్రిప్టో ఖాతాల వివరాలను సేకరించారు. దీనిలో ప్రవాస భారతీయులు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఈ విషయంలో ఢిల్లీ , డెహ్రాడూన్‌తో సహా 22 ప్రదేశాలలో ఖాతాలను సిట్‌ గుర్తించింది. ఈ కేసులో SIT దుబాయ్ పోలీసులతో కూడా సంప్రదిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు, రవీంద్ర సోనిపై 17 మంది ముందుకు వచ్చారు. వీరిలో దుబాయ్‌లో నివసిస్తున్న ముగ్గురు బాధితులు కేసులు నమోదు చేశారు. ఢిల్లీలోని మాల్వియా నగర్‌కు చెందిన సోని కొన్నేళ్ల క్రితం దుబాయ్‌కు మకాం మార్చి 12 షెల్ కంపెనీలను స్థాపించాడు, వాటిలో ఒకటి 'బ్లూ చిప్ ట్రేడింగ్' కంపెనీ. హై-ఎండ్ ఫారెక్స్ ట్రేడింగ్ ముసుగులో, 30-40శాతం తక్షణ రాబడి హామీలతో ప్రవాస భారతీయులను ఆకర్షించాడు. భారతదేశంలోనూ, దుబాయ్‌లోనూ వందలాది భారతీయులను మోసాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్కాం బహుళ దేశాలకు విస్తరించి ఉందని, క్రిప్టోకరెన్సీ లాండరింగ్, హవాలా మార్గాలు ఉన్నాయని, జాతీయ భద్రతాపరమైన చిక్కులు కలిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కనీసం 400-500 మంది పెట్టుబడిదారులను ఈ కంపెనీ మోసంచేసి దాదాపు రూ. రూ. 1500 కోట్లు వసూలు చేసిందని అనుమానిస్తున్నారు. దుబాయ్‌లో ఒకటి, అలీఘర్, కాన్పూర్ నగర్, ఢిల్లీ,పానిపట్‌లలో ఒక్కొక్కటి సహా అతనిపై ఐదు ఎఫ్‌ఐఆర్‌లు ఇప్పటికే నమోదయ్యాయి. బ్లూచిప్, 18 నెలల పాటు కనీసం 10వేల డాలర్లపై పెట్టుబడిపై నెలకు 3 శాతం - లేదా సంవత్సరానికి 36 శాతం - "గ్యారంటీ" రాబడిని ప్రకటించాడు. మొదటి కొన్ని సంవత్సరాలుగా, క్రమం తప్పకుండా రిటర్న్‌లను చెల్లించి అందర్నీ నమ్మించాడు. అకస్మాత్తుగా నిధులను వ్యక్తిగత ఖాతాలు, క్రిప్టోకరెన్సీలు మరియు ఆఫ్‌షోర్ ఛానెల్‌లలోకి మళ్లించేవాడని ఆరోపించారు. అయితే ఈ కంపెనీ 2024లో దివాలా తీసింది. దీంతో వందలాది ఎన్‌ఆర్‌ఐలు భారీ ఎత్తున నష్టపోయారు. దీనిపై జనవరి 5న ఢిల్లీ నివాసి అబ్దుల్ కరీం తనపై దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 30న, డెహ్రాడూన్‌లో కాన్పూర్ పోలీసులు సోనిని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్ నగర్‌లోని లా & ఆర్డర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అంజలి విశ్వకర్మ సమాచారం ప్రకారం వారు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ చిరునామా ఆధారంగా సోని బస చేసిన రహస్య ప్రదేశాన్ని గుర్తించారు. 

Post a Comment

0 Comments

Close Menu