ఫ్లిప్‌కార్ట్ వన్‌ప్లస్ 13ఆర్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ లో అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ వుంది. గత జనవరిలో వన్‌ప్లస్ 13ఆర్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.42,999. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.37,719కి అందుబాటులో ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.4,000 వరకు అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. అదనంగా బ్యాంకు ఆఫ్ బరోడా కార్డ్ ఈఎంఐ ఎంపికతో రూ.1,250 వరకు ఆదా చేసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ ద్వారా అదనపు తగ్గింపును పొందవచ్చు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. వన్‌ప్లస్ 13ఆర్ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల ఎల్‌టీపీఓ 4.1 అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఏఐ పవర్డ్ ఆక్సిజన్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా రన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది భారీ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ను అనుభవాన్ని ఇస్తుంది. ఐపీ 65 రేటింగ్, ఆక్వా టచ్ 2.0ను ఇందులో ఇచ్చారు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్ మరియు 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో వచ్చింది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
0 Comments