Ad Code

దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలన్నదే మా ఆశయం !


భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో మఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచ పటంలో తెలంగాణ మంచి రాష్ట్రంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్‌ ఆదర్శంగా మా అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నాం. 2014లో తెలంగాణ అవతరించింది. సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్ మన కలను సాకారం చేశారు. ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దేశంలో తెలంగాణ నూతన రాష్ట్రం. 2047కు ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ రోడ్‌ మ్యాప్‌ విడుదల చేస్తాం. 2034 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్‌ ఎకనామీగా ఎదగాలనుకుంటున్నాం. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్తాం. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు తీసుకుంటాం. 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికాభివృద్ధికి ఎదగాలనుకుంటున్నాం. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలన్నదే మా ఆశయం. లక్ష్యం పెద్దదైనా సాధిస్తామనే నమ్మకం ఉంది. అందరి సహకారంతో అనుకున్నది సాధిస్తాం అని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu