మునగాకు పొడిని రోజూ ఒక టీస్పూన్ మోతాదులో తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘ కాలిక సమస్యల నియంత్రణలో ఈ పొడి ఎంతో మేలు చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలతో పాటుగా షుగరు.. కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారికి ఉపశమనం ఇస్తుంది. మునగ ఆకు పొడిని వాడడం వల్ల చర్మంపై ముడతలు తగ్గిపోతాయి. దీంతో యవ్వనంగా కనిపి స్తారు. మునగాకుల పొడిలో కాస్త రోజ్ వాటర్ కలిపి నల్లని మచ్చలు, మొటిమలు ఉన్న చోట రాసి ఆ తరువాత తరువాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే ఆయా సమస్యయలు తగ్గుతాయి. మునగాకుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. అందువల్ల ఈ పొడిని రోజూ తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగు తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి బయట పడవచ్చు. దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. మునగాకుల్లో మెగ్నిషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల రక్తం తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. మునగాకుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. దీంతో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అధ్యయనాల్లో మునగ పొడి డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎక్కువగా తగ్గించింది. మునగపొడిలో ఎక్కువగా విటమిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఇతర ముఖ్య బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, క్యాన్సర్, ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఈ పొడితో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. బీపీ అదుపు లోకి వస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. చిన్నారులకు సైతం మునగా కు పొడిని ఇవ్వవచ్చు. మునగాకు పొడిని తినడం కూడా కష్టంగా ఉంటే దాన్ని ఏదైనా ఇతర పదా ర్థంతో కలిపి తినవచ్చు. లేదా రోజూ అన్నంలో మొదటి ముద్దలో తినవచ్చు. చిన్నారులకు పావు టీస్పూన్ మోతాదులో ఈ పొడిని ఇవ్వవచ్చు. పరిమితి మేరకు వినియోగిస్తే మునగాకు తో ఎన్నోఆరోగ్య పరమైన ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
0 Comments