తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొంథా తుపాను బాధితులకు తక్షణ ఆర్థిక సాయం మంజూరు చేసింది. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు గాను రూ. 12. 99 కోట్లను రిలీజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 15 జిల్లాల్లోని 8,662 ఇళ్లకు రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రిలీజ్ చేసింది. ఈ మొత్తాన్ని జిల్లా స్థాయి అధికారులు బాధిత కుటుంబాలకు అందించనున్నారు. ఆయా జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్లు రాష్ర్ట ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట్, నాగర్ కర్నూలు, ములుగు, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
0 Comments