మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తాజాగా మల్లోజుల వేణుగోపాల్ స్పందిస్తూ మావోయిస్టులు ఆయుధాలు వీడాలని వీడియో సందేశం పంపిచారు. ఈ సందర్బంగా మల్లోజుల మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు చనిపోతున్నారు. ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయి. దేశంలో పరిస్థితులు మారాయి. మనం కూడా మారాలి. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నాను. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తన 88560 38533 నెంబరుకు ఫోన్ చేయాలని కోరారు. ఇదిలా ఉండగా 'ఆపరేషన్ కగార్'తో కకావికలమైన మావోయిస్టు పార్టీకి చివరి ఆశ కూడా ఆవిరైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు ఉద్యమం వెన్నెముక విరిగిపోయింది. పార్టీని దశాబ్దాలపాటు నడిపిన గణపతి పక్కకు తప్పుకోవడం.. అనంతరం ఉద్యమాన్ని దూకుడుగా నడిపించిన పార్టీ ప్రధాన కార్యదర్శి, సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఇక మిగిలిన ఒకే ఒక ఆశా కిరణం హిడ్మానే. నంబాల కేశవరావు అనంతరం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినా, పార్టీని దూకుడుగా నడిపించే క్రియాశీల బాధ్యత హిడ్మాకే అప్పగించారు. మిలటరీ ఆపరేషన్స్‌లో దిట్ట కావడంతోపాటు గిరిజనుడైన అతనికి దండకారణ్యంపై పూర్తి పట్టుంది. స్థానిక గిరిజనుల్లో విశేష ఆదరణ ఉంది.
0 Comments