Ad Code

శ్రీవారికి నాలున్నర కోట్ల విలువైన యజ్ఞోపవేతంను కానుకగా ఇచ్చిన నీలోఫర్ కేఫ్‌ ఓనర్ బాబురావు


తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ‘నీలోఫర్ కేఫ్‌’ ఓనర్ బాబురావు వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవేతంను కానుకగా అందజేశారు. దేవదేవుడి దర్శనానికి వెళ్లిన సమయంలో యజ్ఞోపవేతం ఇస్తావా? అని వేంకటేశ్వర స్వామి అడిగినట్టు అనిపించిందని, వెంటనే దాన్ని తయారు చేయించి నెల రోజులు తిరగకుండానే టీటీడీకి అందజేశానని బాబురావు చెప్పారు. యజ్ఞోపవేతం విలువ నాలున్నర కోట్లు అని తెలిపారు. నీలోఫర్ కేఫ్‌లో ఒకప్పుడు వెయిటర్‌గా పనిచేసిన బాబురావు.. ఇప్పుడు యజమాని అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఆదిలాబాద్ నుంచి రైలులో టికెట్ లేకుండా ప్రయాణించిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ.. ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 1978లో ఒక చిన్న కేఫ్ నుంచి నీలోఫర్ కేఫ్ వరకు ఆయన ప్రయాణం సాగింది. ఈరోజు నీలోఫర్ కేఫ్‌కు మూడు బ్రాంచులు ఉన్నాయి. నీలోఫర్ కేఫ్ విజయ మంత్రం గురించి అడిగినప్పుడు.. తాను టేస్ట్ చేయకుండా కస్టమర్‌కు ఏదీ ఇవ్వమని చెప్పారు. పరిమాణం కంటే నాణ్యతను నమ్ముతానని బాబురావు గతంలో తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu