విజయవాడలో నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచాడు. పీక కోయడంతో ఆ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది. విజయవాడ విన్స్ హాస్పిటల్‌లో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుకున్న భర్త విజయ్.. భార్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా పొడిచాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరస్వతిని 2022 ఫిబ్రవరి 14న విజయ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సరస్వతి వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తుండగా, భర్త విజయ్ భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అనుమానం పెనుభూతంగా మారి పట్టపగలే భార్యను విజయ్ దారుణంగా హత్య చేశాడు. వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో సరస్వతి రెండేళ్ల కుమారుడితో ఒంటరిగా నివాసం ఉంటుంది.
0 Comments