తమిళనాడుకు చెందిన 600 మంది మత్స్యకారులు రామేశ్వరం సమీపంలోని పంబన్ ఓడరేవు నుంచి 80 పడవల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో నవంబరు 7 శుక్రవారం ఉదయం గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద వారు వేట మొదలుపెట్టి, వివిధ రకాల చేపలతో తీరానికి చేరుకున్నారు. అందులోని ఓ పడవలోని మత్స్యకారుల వలకు 22 కేజీలు, ఇంకోటి 24 కేజీలు బరువున్న రెండు పెద్ద క్యాట్ ఫిష్‌లు పడ్డాయి. వేలంలో ఈ రెండు చేపలను కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు. చివరకు కిలో రూ.3,600 చొప్పున రూ.1.65 లక్షలకు విక్రయించారు. ఔషధ గుణాలు ఉండే క్యాట్ పిష్‌లను ఖరీదైన సూప్‌ల తయారీలో వాడుతారని మత్స్యకారులు తెలిపారు. ఇది అసాధారణమైనప్పటికీ ఈ ప్రాంతంలో లభ్యమయ్యే ఇతర చేపలకు సైతం వాటి ఔషధ గుణాలు లేదా అరుదైన గుణాల కారణంగా అధిక ధరలకు అమ్ముడుపోతుంటాయి. ఈ ఏడాది జులైలో పాంబన్ దీవిలో వేటకు వెళ్లిన తమిళనాడు మత్స్యకారులకు విచిత్రంగా తోక లేకుండా రెక్కలాంటి శరీరంతో ఉండే 8 కిలోల చేప వలకు చిక్కింది. అయితే, అరుదైన సన్‌ఫిష్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. తోక లేకుండా ఉండే ఈ చేప ఎక్కువగా తూర్పు పసిఫిక్ తీరంలో కనిపిస్తుంది. 200 నుంచి 600 మీటర్ల లోతులో తిరుగుతూ రోజుకు 26 కిలోమీటర్ల వరకూ ఈదే సామర్థ్యం దీనికి ఉంటుంది.
0 Comments