డియోడరెంట్లు క్యాన్సర్‌కు కారణమవుతాయనే భయానికి ప్రధాన కారణం అందులో వాడే కొన్ని రసాయనాలే ఇందులో ఉండే అల్యూమినియం కాంపౌండ్స్ తాత్కాలికంగా చెమట గ్రంథులను మూసివేసి, చెమట పట్టకుండా ఆపుతాయి. ఈ రసాయనాలను చంకల్లో తరచుగా వాడడం వల్ల రొమ్ము కణజాలంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొందరు పరిశోధకులు వాదించారు. పారాబెన్స్ శరీరంలోని కొన్ని కణాలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ మాదిరిగా పనిచేసి, హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపుతాయనే ఆందోళన ఉంది. ఆరోగ్య నిపుణుల అంచనా ప్రకారం డియోడరెంట్లు వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందనే వాదనకు సైద్ధాంతికంగా లేదా శాస్త్రీయంగా ఎటువంటి ఆధారం లేదు. అనేక పరిశోధనలు, అధ్యయనాలు జరిపినా డియోడరెంట్లను రెగ్యులర్‌గా వాడడం వల్ల రొమ్ము క్యాన్సర్ లేదా మరే ఇతర క్యాన్సర్ వస్తుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి పక్కా ఆధారాలు లభించలేదు. ప్రజల్లో ఈ విషయంలో నెలకొన్న భయాలు కేవలం ఊహాజనితం మాత్రమే అని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిశోధనల ప్రకారం రోజువారీ డియోడరెంట్లు వాడకం సురక్షితమే అయినప్పటికీ, అనవసరమైన ఆందోళనలు లేకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. డియోడరెంట్లు కొనే ముందు అందులో వాడిన పదార్థాలను తప్పక పరిశీలించండి. వీలైనంత వరకు అల్యూమినియం-ఫ్రీ, పారాబెన్-ఫ్రీ అని లేబుల్ ఉన్న డియోడరెంట్లను లేదా సహజ సిద్ధంగా తయారుచేసిన ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం చాలా అవసరం.
0 Comments