ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఒక ముఖ్యమైన సందేశం దర్శనమిచ్చింది. మీరు ఇటీవల మా గురించి విన్న ఉండవచ్చు లేదా ఎప్పటినుంచో మా సేవలను వినియోగిస్తున్న వారై ఉండవచ్చు. కానీ మీకు ఒక దుర్వార్త చెప్పాల్సి వస్తోంది. మీ దేశంలో మేము పర్మనెంట్‌గా మా సేవలను నిలిపివేస్తున్నాం. దయచేసి మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం వ్రాసి ఉంది. ఈ సందేశంతో 'ఐబొమ్మ' భారతదేశంలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా, 'బప్పం టీవీ' వెబ్‌సైట్ కూడా ఓపెన్ కాకపోవడం గమనార్హం.
0 Comments