Ad Code

ఉరి వేసే ముందు ఖైదీనైనా చివరి కోరిక అడుగుతారు, కానీ కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను సస్పెండ్ చేశారు !


తెలంగాణలో జాగృతి జనం బాట పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న కల్వకుంట్ల కవిత ఇవాళ వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ పార్టీ నుంచి తనను చాలా అవమానకరంగా బయటకు పంపించారని ఉరి వేసే ముందు ఖైదీనైనా చివరి కోరిక అడుగుతారని కానీ నాకు కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యాక్తం చేశారు. బీఆర్ఎస్‍తో కేసీఆర్‍తో రాజకీయంగా చర్చించడానికి మిగిలింది ఏమీ లేదని, తండ్రిగా కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి తప్పకుండా వెళ్తానన్నారు. నాకు బీఆర్ఎస్‍లో ఎవరితోనూ పంచాయితీ లేదని కుటుంబం నుంచి నన్ను బయటపడేశారని ఆరోపించారు. నేను చెప్పేది చెప్పాను. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ వరకు బీఆర్ఎస్ నుంచి జవాబు లేదన్నారు. నాకు బీఆర్ఎస్‍కు సంబంధం లేదని, బీఆర్ఎస్ విషయంలో చర్చించే పరిస్థితులు దాటిపోయాయని అన్నారు. రాజకీయం, వ్యక్తిగతం వేరు అన్నారు. బీఆర్ఎస్‍లో నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్ కే కట్టడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్ పక్కా చేస్తానని ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. కానీ దానికి ఇంకా సమయం ఉందని ఇప్పుడు ప్రజల సమస్యలపైనే పోరాటం అన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని రూ.11 వందల కోట్ల నుంచి రూ.17 వందల కోట్లకు పెంచారని ఈ పనులు హరీశ్ రావు  బినామీ కంపెనీకి ఇచ్చారని కవిత ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విచారణ వేసిన ప్రభుత్వం ఎందుకు నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలని అసమానతలు లేని తెలంగాణ కావాలన్నదే నా లక్ష్యం అన్నారు. విద్య, వైద్యం విషయంలో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి వేసుకొని నిద్ర పోయే పరిస్థితి ఉండాలని, మహిళలు, విద్యార్థులు, యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు మళ్లీ మొదలు పెట్టాలి. అలాంటప్పుడే కొత్త నాయకత్వం వస్తుందని లేకుంటే పొలిటిషియన్ పిల్లలు, వాళ్ల చుట్టాలే రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉంది. ప్రజల తరఫున అడిగేవారు లేరు అందుకు మేము ఆ పని చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ చిన్న ఎన్నిక. ఈ ఎన్నికల్లో మాకు ఏ స్టాండ్ లేదన్నారు. బీసీల విషయంలో మా కమిట్ మెంట్ కొనసాగుతుందని చెప్పారు. కేంద్రంలో మూడు సార్లు గెలిచిన బీజేపీతో తెలంగాణకు పైసా పని కాలేదని విమర్శించారు. బీఆర్ఎస్‍లో ఉన్నప్పుడు నన్ను నిజామాబాద్ లో పరిమితం చేశారని ప్రోటోకాల్ అనే తాడుతో నన్ను కట్టడి చేశారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంలో బతుకమ్మ సంబరాల్లో తెలంగాణలోని ప్రతి పల్లె తిరిగాను. కానీ ఆ తర్వాత నన్ను నిజామాబాద్ కు మాత్రమే పరిమితం కావాలన్నారు. బీఆర్ఎస్‍లో నేను మంత్రిని కాదు. సంతకంతో పనులు అయిపోయే పరిస్థితిలో లేకుండేనన్నారు. అయినా నా వద్దకు వచ్చిన వారికి శక్తిమించి పనులు చేసేందుకు ప్రయత్నించానని చెప్పారు. సీఎం కూతురిని అయినప్పటికీ నాకే పని కావటానికి ఏడాది పట్టింది. నన్ను కట్టిడి చేసినప్పటికీ... ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాననన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అంటాం. కానీ తెలంగాణలో అందరి వద్ద డబ్బు లేదని ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వాతంత్రం కావాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా పాత్ర మరవలేనిదని ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన జిల్లా వరంగల్ అని కవిత అన్నారు. వరంగల్ అనగానే తనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గుర్తుకు వస్తారన్నారని మా జాగృతి సంస్థకు ఆయనే స్ఫూర్తి, మార్గదర్శకులు అని చెప్పారు. బమ్మెర పోతన అప్పటి రాజు రాజరాజనరేంద్రుడికి తాను రాసిన వాటిని అంకితమివ్వాలంటే అందుకు ససేమిరా అన్నారన్నారు. మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించిన రాణి రుద్రమ గడ్డ ఇదన్నారు. సమ్మక్క, సారలమ్మల గురించి కచ్చితంగా మాట్లాడుకోలని మా పర్యటన ములుగు జిల్లాకు వెళ్లేసరికి సమ్మక్క, సారలమ్మ జాతర జరుగబోతోందన్నారు. దాశరథి పుట్టిన జిల్లా వరంగల్ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇదన్నారని చెప్పారు. తన వరంగల్ పర్యటనతో చాలా మంది జాగృతి గత పదేళ్లలో ఏం చేసిందని అడగవచ్చు? కానీ పదేళ్లలో కూడా ఇంటర్నల్‍గా సమస్యలపై కొట్లాడానన్నారు. ఉమ్మడి జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నుల్లో ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారన్నారు. అందులో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. వాటి కోసం 1306 కేంద్రాలు అని టార్గెట్ పెట్టుకున్నారని కానీ 630 కేంద్రాలు మాత్రమే తెరిచారని ఇప్పటి వరకు 17 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారని విమర్శించారు. రైతులు తమ ధాన్యాన్ని వేరే చోట అమ్ముకునేలా చేస్తున్నారని అంటే బోనస్ ఎగగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ రైతు ఆవేదన ఎవరికీ చెప్పుకోవాలన్నారు. సరైన సమయానికి కొనుగోలు చేయకపోవటం ప్రభుత్వం తప్పు కాదా? అని ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని శాశ్వతం అనుకున్న వాళ్లనే ప్రజలు ఇంట్లో కూర్చొబెట్టారన్నారు. మొంథా తుపానుకు సంబంధించి సీఎం మొక్కుబడి రివ్యూ చేశారని,10 వేలు పరిహారం అన్నారని కానీ ఇప్పటి వరకు ఎవరికీ కూడా పరిహారం అందలేదని విమర్శించారు. ఇక పత్తి రైతు బాధ చెప్పలేనిదని పత్తి ఎకరానికి 7 క్వింటాళ్లే కొంటామంటున్నారన్నారు. ఇన్ని వర్షాలు పడితే తేమ శాతం ఎక్కువగా ఉండదా? ప్రభుత్వం పత్తి రైతులను పట్టించుకోవాలన్నారు.


Post a Comment

0 Comments

Close Menu