Ad Code

బీజాపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోలు మృతి


త్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్‌లోని అనారం, మర్రిమల్ అడవుల్లో ముగ్గురు నక్సల్స్ ను జవాన్లు హతమార్చారు. అన్నారం, మారిమల్ల అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ముగ్గురు నక్సల్స్ మృతదేహాలతో పాటు ఘటనా స్థలం నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోందని ఎస్పీ పేర్కొన్నారు. ఇటీవల గరియాబంద్‌లో రూ.కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే. గరియాబంద్ జిల్లాలోని మెయిన్‌పూర్ అడవుల్లో భద్రతా దళాల కాల్పుల్లో కీలక మావోయిస్టులు హతమయ్యారు. మెయిన్‌పూర్ ప్రాంత అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందడంతో, గరియాబంద్ E30, STF, COBRA బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య అడపాదడపా ఎన్‌కౌంటర్‌లు కొనసాగుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu