Ad Code

అశ్లీల చిత్రాలు చూడటం నేరమే : సుప్రీంకోర్టు


భారత ప్రధాన న్యాయమూర్తిగా ఈ నెలలో పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న ఆశ్లీలత (పోర్నోగ్రఫీ)పై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చింది. దేశంలో పోర్నోగ్రఫీని నిషేధించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరగా, నేపాల్ లో ఏం జరిగిందో చూశారుగా అంటూ జెన్ జీ నిరసనల్ని బెంచ్ గుర్తుచేసింది. నేపాల్ లో సోషల్ మీడియాపై బ్యాన్ విధించగా, అక్కడి యువత రోడ్లపైకి వచ్చి చేసిన గందరగోళాన్ని పిటిషనర్ కు సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు సులభంగా లభిస్తాయని, కేంద్ర ప్రభుత్వం అశ్లీల చిత్రాలను అరికట్టడానికి ఒక విధానాన్ని రూపొందించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. అశ్లీల చిత్రాలను చూడటం వ్యక్తులు , సమాజాన్ని, ముఖ్యంగా 13 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పెరుగుతున్న మనస్సులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పిటిషనర్ తెలిపారు. ప్రజలు అశ్లీల కంటెంట్‌ను యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి సమర్థవంతమైన యంత్రాంగం లేకపోవడాన్ని పిటిషనర్ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం దీనిపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వబోమని తెలిపింది. అయితే నాలుగు వారాల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ జరిపేందుకు మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ప్రస్తుతం మన దేశంలో ఆశ్లీల చిత్రాలు చూడటంపై ఎలాంటి నిషేధం లేదు. అయితే ఈ కంటెంట్ తయారీ మాత్రం చట్టవిరుద్ధం. వాణిజ్య అవసరాల కోసం పోర్న్ కంటెంట్ తయారు చేస్తే మాత్రం భారత న్యాయసంహితతో పాటు ఐటీ చట్టం ప్రకారం శిక్షించే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారాయి.

Post a Comment

0 Comments

Close Menu