Ad Code

ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్


-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిను కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని.. పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లూ కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రన్ చేసినట్లు నిర్ధారించారు. కాగా, సినిమాల పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే పేరు ఐ-బొమ్మ. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీల్లోని కంటెంట్‌ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ సైట్‌లో అప్ లోడ్ చేస్తోంది. అయితే ఈ మధ్యన ఐ-బొమ్మ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. థియేటర్‌లో అయిన సినిమాలను కూడా గంటల వ్యవధిలోనే పైరసీ చేస్తున్నారు. దీంతో తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఐ-బొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్‌పై ఐ-బొమ్మ నిర్వహకుడు స్పందిస్తూ పోలీసులకే వార్నింగ్​ఇచ్చాడు. ''మీరు మాపై దృష్టి పెడితే.. మేము మీపై ఫోకస్​ చేయాల్సి ఉంటుంది'' అని హెచ్చరించాడు. ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది.. వెనక్కి తగ్గం. మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి'' అని పోలీసులకు ఐ-బొమ్మ నిర్వహకుడు సవాల్ చేశారు. ఈ సవాల్‌పై అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ తప్పకుండా ఐ-బొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తామని తెలుగు నిర్మాతలను హమీ ఇచ్చారు. 


Post a Comment

0 Comments

Close Menu