తెలంగాణలో సీఎంవో వాట్సాప్ గ్రూప్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులకు చెందిన వాట్సాప్ మీడియా గ్రూప్‍లను హ్యాక్ చేశారు. ఎస్‍బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ను షేర్ చేసిన కేటుగాళ్లు ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ ఎస్బీఐ పేరుతో సందేశాలు పంపిస్తున్నారు. మరో వైపు ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన వారికి సంబంధించిన వాట్సాప్ మీడియా గ్రూప్ లను సైబర్ నేరగాళ్లు లక్ష్యం చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
0 Comments