హైదరాబాద్ లోని రామంతపూర్, కేసీఆర్‌నగర్‌లో నీటి సంపులో పడి గృహిణి మృతి చెందింది. నల్లా వాల్ బంద్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు భారతి అనే మహిళ సంపులో పడింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను సంపులో నుంచి బయటకు తీసి హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే భారతి మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. శ్రీకాకుళంకు చెందిన భారతి కుటుంబం 20ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి రామంతపూర్‌లో నివాసం ఉంటోంది. ఇవాళ ఉదయం ఐదున్నర గంటల సమయంలో నల్లా వాల్ బంద్ చేసే క్రమంలో నీటి సంపులో పడి భారతి మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments